తెలంగాణలో SIR గడువును పొడిగించండి.. ఈసీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:09 PM
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) గడువును పొడిగించాలంటూ ఈసీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని మంత్రి అన్నారు.
హైదరాబాద్, జులై 14: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) గడువును పొడిగించాలంటూ ఈసీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు(మంగళవారం) మంత్రి పొన్నం నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో SIR గడువు పొడిగించాలని కాంగ్రెస్ నేతలు అభ్యర్ధించారు. ఓటరు నమోదు ప్రక్రియకు మరింత సమయం ఇవ్వాలన్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. హైదరాబాద్‌లో కేవలం 21% ఓటరు సవరణే పూర్తయిందని చెప్పారు. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. అది సరిపోదని.. సర్ గడువును పొడిగించాలని కోరారు.
హైదరాబాద్‌లో 4,500 పోలింగ్ స్టేషన్లలో ప్రక్రియ నత్తనడకన సాగుతోందని మంత్రి వెల్లడించారు. బూత్ స్థాయి అధికారులు(BLO) ఇళ్లకు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు సరిగా ఇవ్వడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ క్యాడర్ చురుకుగా పనిచేయాలని సూచించారు. ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు రావనే ప్రచారం కూడా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆదాయానికి మించి అక్రమాస్తులు.. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్
రక్తం ప్యాకెట్లతో రాజకీయం అవసరం లేదు.. బీఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్
Read Latest Telangana News And Telugu News