Share News

మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫర్నీచర్ షాపులు దగ్ధం

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:54 AM

మేడ్చల్ చెక్‌పోస్ట్‌ సమీపంలోని రెండు రెండు ఫర్నీచర్ షాపుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫర్నీచర్ షాపులు దగ్ధం

హైదరాబాద్, అక్టోబర్ 04: మేడ్చల్ చెక్‌పోస్ట్‌ సమీపంలోని రెండు ఫర్నీచర్ షాపుల్లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఫర్నీచర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ మంటలు పక్కనే ఉన్న షాపులకు కూడా వ్యాపించాయి. దాంతో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు.


ఫైర్ ఇంజన్‌‌తో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఫర్నిచర్ షాప్ యాజమానులు వెల్లడించారు. ఫర్నీచర్ షాపుల్లోని కలప, ఫోమ్ వల్ల మంటలు ఎగిసిపడ్డాయని.. అందవల్లే దట్టమైన పొగ అలుముకుందని చెప్పారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం లేదని వారు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో

Updated Date - Oct 04 , 2026 | 07:22 AM