Share News

మేడ్చల్‌లో దారుణం.. భోజనం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కంటైనర్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:42 PM

మేడ్చల్ జిల్లా ఔటర్ రింగ్ రోడ్‌‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఆపి భోజనం చేస్తున్న వారిపై కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మేడ్చల్‌లో దారుణం.. భోజనం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కంటైనర్‌
Medchal Road Accident

మేడ్చల్ జిల్లా: శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్‌ (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆపి భోజనం చేస్తున్న వారిపై ఓ కంటైనర్ వేగంగా దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.


స్థానికుల సమాచారం ప్రకారం, నగరంలోని మౌలాలి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆడి కారులో ప్రయాణిస్తున్నారు. శామీర్‌పేట సమీపంలోని ORRపై వారు కారును ఆపి పక్కనే నిలబడి భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన కంటైనర్ వారిపై దూసుకెళ్లింది.


ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శామీర్‌పేట పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి పంచనామా నిర్వహించారు.


అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ అసెంబ్లీ.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్

పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా: రాజాసింగ్

Read Latest Telangana News

Updated Date - Mar 16 , 2026 | 04:46 PM