Share News

మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

ABN , Publish Date - Sep 28 , 2026 | 07:03 AM

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క- సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి.

మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
Medaram Mini Jatara 2027

  • ఫిబ్రవరి 17 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహణ

ములుగు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క- సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2027 ఫిబ్రవరి 17 నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించనున్నట్లు పూజారుల (వడ్డెలు) సంఘం ఆదివారం ప్రకటించింది. సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాల్‌రావు ఆధ్వర్యంలో పూజారులు, ములుగు జిల్లా అధికారులు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్కకు లేఖ ద్వారా వివరాలను వెల్లడించారు.


ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర నడుమ వచ్చే సంవత్సరంలో ఈ మినీ జాతరను నిర్వహిస్తుంటారు. ఫిబ్రవరి 17న అమ్మవార్ల మండ మెలిగే పండుగతో మినీ జాతర ప్రారంభమవుతుంది. 18న పూజారులు ప్రత్యేక పూజలు, నివేదనలు నిర్వహిస్తారు. 19న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 20న జాతర ముగుస్తుంది. నాలుగు రోజులపాటు అమ్మవార్లకు ఆదివాసీల సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుగుతాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

మన్మోహన్‌ పేరుతో యూనివర్సిటీ పెట్టాం

రాష్ట్ర ప్రజలు ఓట్లేసి సీఎంను చేస్తే.. సోనియా కుటుంబం కోసం ప్రాణాలిస్తారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 07:03 AM