Share News

మలక్‌పేట్‌లో రిటైర్డ్ ఎస్పీ కారుపై ఆగంతకుల దాడి.. పోలీసులు కేసు నమోదు

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:04 AM

హైదరాబాద్‌ మలక్‌పేట్‌లో రిటైర్డ్ ఎస్పీ కారుపై ఆగంతకులు దాడి చేశారు. ఈ దాడిపై మలక్‌పేట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మలక్‌పేట్‌లో రిటైర్డ్ ఎస్పీ కారుపై ఆగంతకుల దాడి.. పోలీసులు కేసు నమోదు

హైదరాబాద్, నవంబర్ 04: నగరంలోని మలక్‌పేట్‌లో రిటైర్డ్ ఎస్పీ కారుపై ఆగంతకులు దాడి చేశారు. ఈ దాడిపై మలక్‌పేట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ముసారాంబాగ్ ఎస్‌బీఐ కాలనీలో వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎస్పీ ఎస్. డి. గౌతమ్ నివాసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన కారును ఆగంతకులు బండరాయితో ధ్వంసం చేశారు.


ఈ దాడిలో కారు వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. నంబర్ ప్లేట్ కూడా దెబ్బతింది. ఈ దాడితో రూ. 40 వేలు నష్టం వాటిల్లిందని రిటైర్డ్ ఎస్పీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కారుపై జాతీయ జెండాను కూడా దుండుగులు తొలగించారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. రిటైర్డ్ ఎస్పీ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను మలక్‌పేట పోలీసులు పరిశీలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ పుర పోరులో కూటమి గెలుపు హోరు

ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

For More TG News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 10:16 AM