Share News

సిరిసిల్లలో 8 వేల ఎకరాలు కబ్జా చేసిందెవరు?

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:52 AM

అసెంబ్లీలో చెప్పినట్లు సిరిసిల్లలో 8,000 ఎకరాల భూమిని ఎవరు కబ్జా చేశారో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు.

సిరిసిల్లలో 8 వేల ఎకరాలు కబ్జా చేసిందెవరు?
KTR

  • ఆరోపణలు నిరూపించకుంటే సీఎం క్షమాపణ చెప్పాలి

  • పాలమూరు రైతులకు తొలి శత్రువు సీఎం రేవంత్‌:కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో చెప్పినట్లు సిరిసిల్లలో 8,000 ఎకరాల భూమిని ఎవరు కబ్జా చేశారో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో అమలు చేయడానికి వస్తున్నారా? సిరిసిల్లకు వచ్చి ఏం చెబుతారని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. నేతన్నల ఆత్మహత్యలు, ఎగ్గొట్టిన రైతుబంధు గురించి వివరిస్తారా? అని ఎద్దేవా చేశారు. సీఎం కుటుంబ ఆస్తులపై సిట్టింగ్‌ విచారణకు సిద్థమని సవాల్‌ చేస్తే ఇప్పటి వరకు కనీసం స్పందన కూడా లేదన్నారు.


వరద జలాలపై కట్టిన ప్రాజెక్టులకు ఏపీ నీళ్లు తీసుకెళ్తుంటే, ఇక్కడ నికర జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల కింది ఆయకట్టుకూ నీరు ఇవ్వడం లేదని, సాగునీరు ఇవ్వనందుకు పాలమూరు రైతులకు రేవంత్‌రెడ్డి తొలి శత్రువని కేటీఆర్‌ ఆరోపించారు. తాగునీటికి కేవలం రెండు టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, 9 టీఎంసీలు ఉన్న జూరాల నుంచి చుక్కనీరు విడుదల చేయకుండా.. కుంటి సాకులతో పచ్చని పంటల ఉసురు తీస్తూ ప్రాజెక్టు ఆయకట్టు రైతులను కళ్ల ముందే సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని పాపమన్నారు. పంటను కాపాడుకునేందుకు గుండె పగిలి, జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి ప్రయత్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించి వారిని ప్రభుత్వం అన్ని విధాల అరిగోస పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నేపల్లి, నార్లపూర్‌ పంపులు ఆన్‌ చేయాలని, కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి పది టీఎంసీల నీరు తెచ్చి పంటలు కాపాడాలని, రైతుల విషయంలో రాజకీయం చేయొద్దన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగదీశ్‌రెడ్డికి వందల కోట్ల ఆస్తులు
కాంగ్రెస్‌ నేతల ఆస్తుల వద్దకు బీఆర్‌ఎస్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 06:52 AM