Share News

ఫార్ములా-ఈ కేసు నుంచి నా పేరు తొలగించండి

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:16 AM

ఫార్ములా-ఈ కార్‌ రేసు వ్యవహారంలో ఏసీబీ దాఖలుచేసిన కేసు నుంచి తన పేరును తొలగించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఫార్ములా-ఈ కేసు నుంచి నా పేరు తొలగించండి
KTR Discharge Petition

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌

ఫార్ములా-ఈ కార్‌ రేసు వ్యవహారంలో ఏసీబీ దాఖలుచేసిన కేసు నుంచి తన పేరును తొలగించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్‌ 262 (1) కింద నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీనిని విచారించిన కోర్టు, కౌంటర్‌ దాఖలు చేయాలని కేసు దర్యాప్తు అధికారిని ఆదేశించి.. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.


2024 డిసెంబరులో నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు తనకు వ్యతిరేకంగా దర్యాప్తు అధికారులు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదని, ఇది పూర్తిగా రాజకీయ దుర్దేశంతో పెట్టిన అక్రమ కేసు అని డిశ్చార్జ్‌ పిటిషన్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు. దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేనందున తక్షణమే ఏ1గా ఉన్న తన పేరును తొలగించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ చార్జీల పునఃపరిశీలన

రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ

ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 06:16 AM