కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:22 PM
తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.. బర్తరఫ్ చేస్తారా? అంటూ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.. బర్తరఫ్ చేస్తారా? అంటూ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సురేఖను బర్తరఫ్ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమోద ముద్ర లభించగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సిఫారసు లేఖను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు పంపించారు. రాజీనామాకు కొండా సురేఖ అంగీకరించకపోవడంతో ఆమెను తొలగించాలని సీఎం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు చిన్నారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక.. కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో ఏఐసీసీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరిచే వాళ్ల పట్ల కఠినంగానే ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీపై గౌరవం లేనివాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ క్యాడర్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి...
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేల్చేస్తారా..
కొండా సురేఖ ఎపిసోడ్.. నేటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో: రాజాసింగ్
Read Latest Telangana News And Telugu News