మీడియా ముందుకు వచ్చి.. మీసం తిప్పిన కొండా మురళి!
ABN , Publish Date - Sep 03 , 2026 | 07:37 PM
తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించడంపై ఆమె భర్త కొండా మురళి తనదైన హావభావాలతో స్పందించారు. ఆయన మీసం తిప్పుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేయగా.. ఆమె భర్త కొండా మురళి మాత్రం తనదైన శైలిలో స్పందించారు.
సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారనే వార్తలు వెలువడిన సమయంలో కొండా మురళి ఇంటి నుంచి బయటకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చిన ఆయన చిరునవ్వుతో కనిపిస్తూ మీసం తిప్పారు. ఆయన స్పందించిన తీరు, హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం దారుణం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ..