Share News

గుజరాత్‌ ‘చింతన్‌శివిర్‌’కు మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:10 AM

గుజరాత్‌ రాష్ట్రంలోని నర్మదా జిల్లా ఎక్తానగర్‌లో స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద సోమ, మంగళవారాల్లో జరిగే ‘చింతన్‌ శివిర్‌-2026’కు రాష్ట్రం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకానున్నారు.

గుజరాత్‌ ‘చింతన్‌శివిర్‌’కు మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy

  • రాజకీయాలకతీతంగా గడ్కరీ సహకరిస్తున్నారని ప్రశంస

  • ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో భేటీ.. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చర్చ

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌ రాష్ట్రంలోని నర్మదా జిల్లా ఎక్తానగర్‌లో స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద సోమ, మంగళవారాల్లో జరిగే ‘చింతన్‌ శివిర్‌-2026’కు రాష్ట్రం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నమే ఆర్‌ అండ్‌ బీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికా్‌సరాజ్‌, సీఈలు బి.వి.రావు, వసంత్‌నాయక్‌, ధర్మారెడ్డి ఇతర అధికారుల బృందంతో కలిసి మంత్రి గుజరాత్‌కు వెళ్లారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన కేంద్ర ఉపరితల రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ చింతన్‌ శివిర్‌ వర్క్‌షా్‌పను నిర్వహించనున్నారు. ఇందులో పీఎం గతిశక్తి, పలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చిస్తారు. చింతన్‌ శివిర్‌కు వెళ్లడానికి ముందుగా మంత్రి కోమటిరెడ్డి.. సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు.


ఈ సందర్భంగా సీఎం.. మంత్రితో పలు కీలక ప్రాజెక్టుల నిర్మాణ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో.. మంత్రి కోమటిరెడ్డి చర్చించనున్నారు. కాగా చింతన్‌శివిర్‌ కార్యక్రమ ప్రాంగణానికి చేరుకున్న వెంటనే మంత్రి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చైర్మన్‌ సంతోష్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటి పురోగతిపై చర్చించారు. కాగా గుజరాత్‌ చేరుకున్న తరువాత మంత్రి కోమటిరెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి గడ్కరీ దేశంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా గడ్కరీ రాష్ట్రాలకు సహకరిస్తున్నారని ప్రశంసించినట్లు మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.


ఇవి కూడా చదవండి...
రూ.400 కోట్లతో సాబన్‌ మెగా డెయిరీ ప్లాంట్‌

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి

టీమార్స్‌ చీఫ్‌ ఎవరో?

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 06:10 AM