Share News

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:00 AM

హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, తన హయాంలోనే ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీఇచ్చారు.

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy

లక్ష్మీదేవిపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, తన హయాంలోనే ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీఇచ్చారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా రేగళ్ల గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మంత్రి పొంగులేటిని కొత్తగూడెంకు చెందిన జర్నలిస్టులు కలిశారు.


తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. గతంలో రామవరం ముర్రేడు బ్రిడ్జి సమీపంలో జర్నలిస్టులకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, కొన్ని అనివార్య కారణాల వల్ల స్థల కేటాయింపు అర్థాంతరంగా నిలిచిపోయిందని పాత్రికేయులు గుర్తు చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. హైదరాబాద్‌తో పాటు స్థానిక జర్నలిస్టుల స్థలాల కేటాయింపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


ఇవి కూడా చదవండి...
ఏసీబీ కష్టపడి పట్టుకున్న నిందితులను లోపాయికారీగా వదిలేస్తారా?

ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశను దాటాం
టీమార్స్‌ చీఫ్‌ ఎవరో?

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 06:00 AM