రూ.400 కోట్లతో సాబన్ మెగా డెయిరీ ప్లాంట్
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:04 AM
తెలంగాణ పాడి రైతులకు మరింత మెరుగైన మార్కెట్ అవకాశాల కల్పనకు సాబర్ (అమూల్) డెయిరీ మెగా ఇంటిగ్రేటెడ్ డెయిరీ ప్లాంట్ దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
రోజూ 5 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పాడి రైతులకు మరింత మెరుగైన మార్కెట్ అవకాశాల కల్పనకు సాబర్ (అమూల్) డెయిరీ మెగా ఇంటిగ్రేటెడ్ డెయిరీ ప్లాంట్ దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ర్టియల్ పార్క్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌కు భూమి పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెయిరీ ప్రాసెసింగ్ రంగానికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయి కానుందన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ, ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాల నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి సాబర్ డెయిరీ ప్రాజెక్టు నిదర్శనమన్నారు.
ప్రారంభంలో రోజుకు 5 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా సుమారు 350 మందికి ఉపాధితోపాటు పాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, పంపిణీ తదితర కార్యక్రమాలతో సుమారు 10 వేల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కొత్త ప్లాంట్‌లో పాలు, పెరుగు, పనీర్, ఐస్‌క్రీమ్, లస్సీ, నెయ్యి, మజ్జిగ, బేకరీ ఉత్పత్తుల తయారీ వల్ల రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టుతో పాల ప్రాసెసింగ్ ప్లాంట్‌తోపాటు పాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, కోల్డ్ చెయిన్, ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్, అనుబంధ సేవల వరకూ పూర్తిస్థాయి డెయిరీ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణ ఉపాధి, రైతు ఆధారిత విలువ నెట్‌వర్క్‌లను బలోపేతం చేసే పెట్టుబడులకు నిరంతరం సహకరిస్తామన్న శ్రీధర్‌బాబు.. విస్తరణకు వేదికగా తెలంగాణను ఎంచుకున్న సాబర్ డెయిరీ, అమూల్ సంస్థలకు అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఏసీబీ కష్టపడి పట్టుకున్న నిందితులను లోపాయికారీగా వదిలేస్తారా?
హైదరాబాద్‌లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telugu News