రాహుల్ త్వరలో ప్రధాని కాబోతున్నారు: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:47 AM
రాహుల్ గాంధీ త్వరలోనే దేశానికి ప్రధాన మంత్రి కాబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీ త్వరలోనే దేశానికి ప్రధాన మంత్రి కాబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ లాగా రాహుల్‌గాంధీ తండ్రి చాటు కొడుకు కాదన్నారు.
దేశమే తన కుటుంబంగా రాహుల్ భావిస్తున్నారని, ఆయన గురించి మాట్లాడేముందు కేటీఆర్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు, తమ నేత రాహుల్‌గాంధీ 7సార్లు బహిరంగ చర్చలకు సవాల్ విసిరినా ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని మంత్రి అన్నారు. మోదీ ఇకనైనా దాటవేత ధోరణిని విడిచి రాహుల్ సవాల్‌ను స్వీకరించాలన్నారు.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం