Share News

ఉన్నత పదవుల్లోని ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:07 AM

‘ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలి’ అంటూ ..

ఉన్నత పదవుల్లోని ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి

  • అధికారం ఉందని అహంతో వ్యవహరిస్తే ప్రజలు హర్షించరు

  • సీఎం రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు..

హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలి’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


‘అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే.. ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం.. చరిత్ర ఎన్నటికీ క్షమించదని మరువరాదు! ఇచ్చిన హామీలను అమలు చేసేలా.. ధర్మంగా, నిజాయతీగా పాలన సాగించేలా.. ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను. స్వామియే శరణం అయ్యప్ప..’ అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అయితే సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఆయన కూడా ఎక్స్‌ వేదికగా ఈ మేరకు పోస్టు చేసి ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:07 AM