Share News

బహుజన తెలంగాణ కోసం బతుకమ్మ ఉద్యమం

ABN , Publish Date - Oct 12 , 2026 | 06:35 AM

బహుజన తెలంగాణ సాధన కోసం మరో బతుకమ్మ ఉద్యమానికి తెలంగాణ రక్షణసేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పేదింటి బిడ్డలకు అధికారంలో భాగస్వామ్యం దక్కాలని, విశ్వవిద్యాలయాలు నాయకులను తయారు చేసే కేంద్రాలుగా మారాలన్నారు.

బహుజన తెలంగాణ కోసం బతుకమ్మ ఉద్యమం
Kalvakuntla Kavitha

  • ఓయూలో బతుకమ్మ సంబురాల్లో కల్వకుంట్ల కవిత

ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): బహుజన తెలంగాణ సాధన కోసం మరో బతుకమ్మ ఉద్యమానికి తెలంగాణ రక్షణసేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పేదింటి బిడ్డలకు అధికారంలో భాగస్వామ్యం దక్కాలని, విశ్వవిద్యాలయాలు నాయకులను తయారు చేసే కేంద్రాలుగా మారాలన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మలో అన్ని రకాల పూలున్నట్లే, భవిష్యత్తు తెలంగాణలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉండాలని వ్యాఖ్యానించారు.


ఓయూకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించి 6 నెలలు గడిచినా సీఎం రేవంత్‌రెడ్డి నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి ముక్కుపిండి అయినా ఆ నిధులను సాధించాలని, విద్యార్థులతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని.. హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు రెండూ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం కాదని, మొత్తం ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు

డ్రగ్స్‌ పెడ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్‌ నజర్‌

ఓటు కోల్పోయిన వారితో మీదగ్గరికొస్తా..!

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 06:35 AM