Share News

బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు

ABN , Publish Date - Oct 12 , 2026 | 06:30 AM

వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు ఆదివారం వేద మంత్రాల మధ్య వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.

బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు
Bala Tripura Sundari

వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు ఆదివారం వేద మంత్రాల మధ్య వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటలకు అమ్మవారికి నిత్యపూజ నిర్వహించి ఉత్సవాల నిర్వహణకు ఆజ్ఞ ప్రార్థన జరిపించారు. అమ్మవారిని మొదటి రోజు శ్రీబాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఉదయం వృషభ వాహనంపై, సాయంత్రం మృగ వాహనంపై ఊరేగించారు.

- ఆంధ్రజ్యోతి, వరంగల్‌ కల్చరల్‌


విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ.. శ్రీ బాలాత్రిపురసుందరిదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2.30 గంటలకు కవాత ఉద్ఘాటన నిర్వహించిన అనంతరం అమ్మవారికి సుప్రభాత సేవ చేశారు. మూడు గంటలకు అమ్మవారు, ఉపాలయాలమూర్తులకు స్నపనాభిషేకం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజునే లక్ష మందిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

- ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి


ఈ వార్తలు కూడా చదవండి:

ఐదేళ్ల బాలిక దారుణ హత్య

ఢిల్లీలో మీకు హక్కులు.. తెలంగాణలో మాకు నిర్బంధాలా?

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 06:30 AM