Share News

మహిళలు, బహుజనుల కోసం పనిచేస్తా: కవిత

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:19 AM

ఎన్నికలు, ఇతర సందర్భాల్లో ఇతర రాజకీయ పార్టీల తీరు ఎలా ఉన్నా.. తమ పార్టీలో మాత్రం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మహిళలకు 50 శాతం...

మహిళలు, బహుజనుల కోసం పనిచేస్తా: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు, ఇతర సందర్భాల్లో ఇతర రాజకీయ పార్టీల తీరు ఎలా ఉన్నా.. తమ పార్టీలో మాత్రం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మహిళలకు 50 శాతం సీట్లను కేటాయిస్తామని తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం, పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి ‘తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ’ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మ పాటలు పాడుతూ అందరితో కలిసి వేడుకలో పాల్గొన్నారు. రాజకీయ రంగంలో మహిళా నాయకత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని, మహిళలు, బహుజనుల కోసం పాటు పడుతున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ చార్జీల పునఃపరిశీలన

రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ

ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 06:47 AM