Share News

కడియంను నేను బెదిరించలేదు!

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:40 AM

అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరిని తాను బెదిరించలేదని, ఎలాంటి వ్యాఖ్యలు, సంజ్ఞలు చేయలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి, ట్రెజరీ బెంచి వైపు ఎందుకున్నావని అడిగితే.. ఆయనే తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు.

కడియంను నేను బెదిరించలేదు!
Padi Kaushik Reddy

  • ఆయనే దూషించారు...

  • ఎథిక్స్‌ కమిటీకి కౌశిక్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరిని తాను బెదిరించలేదని, ఎలాంటి వ్యాఖ్యలు, సంజ్ఞలు చేయలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి, ట్రెజరీ బెంచి వైపు ఎందుకున్నావని అడిగితే.. ఆయనే తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే తాను మాట్లాడానన్నారు. ఈ మేరకు తనపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమని, తన మాటలు, సైగలను వక్రీకరించారని పేర్కొంటూ అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీకి బుధవారం కౌశిక్‌రెడ్డి లిఖిత పూర్వకంగా లేఖ రాశారు.


‘‘నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా’’ అంటూ, అదేవిధంగా గన్‌ గురిపెట్టినట్లు వేలితో బెదిరించినట్లు వస్తున్నవి తప్పుడు ఆరోపణలని ఎథిక్స్‌ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సభలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, నినాదాలు, పరస్పర ఆరోపణలు చోటుచేసుకోగా.. తన సంజ్ఞలను మాత్రమే వేరుచేసి చూడటం సరికాదన్నారు. ఎథిక్స్‌ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని కోరారు. తనపై సభలో ఆరోపణలు చేసిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వెడ్మ బొజ్జు ఎథిక్స్‌ కమిటీ విచారణ నుంచి తప్పుకోవాలని, వారికి బదులుగా నిష్పక్షపాతంగా వ్యవహరించే ఇతర సభ్యులతో విచారణ జరపాలని కౌశిక్‌రెడ్డి తన లేఖ ద్వారా కోరారు.


ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 06:40 AM