Share News

డీలిమిటేషన్‌తో తెలంగాణకు అన్యాయం చేస్తే మరో ఉద్యమం తప్పదు: కల్వకుంట్ల కవిత

ABN , Publish Date - Apr 16 , 2026 | 10:40 AM

మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

డీలిమిటేషన్‌తో తెలంగాణకు అన్యాయం చేస్తే మరో ఉద్యమం తప్పదు: కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha News

హైదరాబాద్, ఏప్రిల్ 16 : మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి, డీలిమిటేషన్ బిల్లును కాల్చే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆమె విమర్శించారు.


డీలిమిటేషన్ బిల్లుపై ఢిల్లీ వేదికగా కవిత మాట్లాడుతూ.. ‘మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేది లేదు. ఒకవేళ డీలిమిటేషన్ పేరుతో తెలంగాణ సీట్ల సంఖ్యను తగ్గిస్తే, రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో ఉద్యమం తప్పదు. మహిళా రిజర్వేషన్లలో కచ్చితంగా బీసీ సబ్ కోటా ఉండాలి. అప్పుడే వెనుకబడిన వర్గాల మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కుతుంది’ అని అన్నారు.


ఇవీ చదవండి:

మా అభిప్రాయాన్ని ముందే చెప్పాం.. రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై సోనియా గాంధీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మూడు ప్రధాన బిల్లులపై చర్చ

Updated Date - Apr 16 , 2026 | 01:53 PM