Share News

కవిత కొత్త పార్టీ పేరు ఇదే అంటూ జోరుగా ప్రచారం..

ABN , Publish Date - Apr 25 , 2026 | 09:50 AM

కవిత కొత్త పార్టీ పేరుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ వికాస సమితి అనే పేర్లు తొలుత ప్రచారం అయ్యాయి.

కవిత కొత్త పార్టీ పేరు ఇదే అంటూ జోరుగా ప్రచారం..
Kalvakuntla Kavitha

హైదరాబాద్: మరికొద్ది సేపట్లో తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్‌కు కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీగా బయలుదేరారు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు కవిత దంపతులు.


అనంతరం గన్ పార్క్‌ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా మునీరాబాద్‌కు బయలుదేరారు. కాగా, ఇప్పటికే పార్టీ పేరు, జెండా వంటివి నిర్ణయించారు కవిత. అయితే, కవిత కొత్త పార్టీ పేరుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ వికాస సమితి అనే పేర్లు తొలుత ప్రచారం అయ్యాయి. ఈరోజు కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్రీయ సమితి అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, పార్టీ పేరు, జెండాపై మరికాసేపట్లో పూర్తి క్లారిటీ రానుంది.


ఈ వార్తలు కూడా చదవండి

భార్యను చంపి.. ఉరేసుకున్న భర్త

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు..

Updated Date - Apr 25 , 2026 | 10:12 AM