Share News

భార్యను చంపి.. ఉరేసుకున్న భర్త

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:34 AM

అనుమానంతో ఓ భర్త తన భార్యను చంపి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. సిద్ధాపూర్‌కు చెందిన రాజు(43), రాణి(40) భార్యాభర్తలు.

భార్యను చంపి.. ఉరేసుకున్న భర్త

  • అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు

  • సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘటన

సదాశివపేట, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): అనుమానంతో ఓ భర్త తన భార్యను చంపి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. సిద్ధాపూర్‌కు చెందిన రాజు(43), రాణి(40) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా రాజు భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవారు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో భార్యతో గొడవపడి రోకలిబండతో తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం రాజు తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - Apr 25 , 2026 | 07:35 AM