Share News

జస్టిస్‌ వినోద్‌ కుమార్‌కు ఘనంగా వీడ్కోలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:44 AM

పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌కు సోమవారం సహచరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

జస్టిస్‌ వినోద్‌ కుమార్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌కు సోమవారం సహచరులు ఘనంగా వీడ్కోలు పలికారు. మొదటి కోర్టు హాలులో జరిగిన సమావేశంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోషీ, అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డిలు మాట్లాడుతూ ఆయన సేవలు అసాధారణమైనవని కొనియాడారు.


రిటైర్‌ అయినప్పటికీ ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఉపయోగించుకుంటుందని అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. తనకు ప్రజల్లో పేరుప్రఖ్యాతులు రావాలన్న ఆశ ఎప్పుడూ లేదని, తనకు రాజ్యంగమే గీటురాయి అని పేర్కొన్నారు. తనపై వచ్చిన వదంతులు కాలగర్భంలో కలిసి పోతాయని అన్నారు. చేసిన ప్రమాణానికి కట్టుబడే విధులు నిర్వహించానే తప్ప ఎక్కడా రాజ్యాంగాన్ని మీరి ప్రవర్తించలేదని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 06:45 AM