మద్యం ధరలు పెంచితే తాగడం తక్కువ కాదు.. ఆదాయం పెరుగుతోంది: మంత్రి జూపల్లి
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:49 PM
మద్యం ధరలు పెంచితే తాగడం తక్కువ కాదని.. ఆదాయం పెరుగుతుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
హైదరాబాద్, అక్టోబర్ 06: మద్యం ధరలు పెంచితే తాగడం తక్కువ కాదని.. ఆదాయం పెరుగుతుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ హయాంలో మద్యం విక్రయాల ద్వారా రూ.10 వేల నుంచి రూ.36 వేల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
ఆ పదేళ్లలో మద్యం విక్రయాల ద్వారా 265 శాతం ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మద్యం విక్రయాల ద్వారా రూ.40 వేల కోట్లు ఆదాయం వస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4 వేల కోట్ల ఆదాయం మాత్రమే పెరిగిందని గణాంకాలతో సహా ఆయన వివరించారు.
ఇక క్యూర్ అర్బన్ పరిధిలో 40 ఎక్స్‌ట్రా బార్లులు వచ్చాయని చెప్పారు. అయితే బార్ షాపుల వాళ్లకు కూడా కాంపిటీషన్ ఉంటుందన్నారు. మిగతా రాష్ట్రాల్లో వలే తెలంగాణలో కూడా ఈ కాంపిటేషన్ ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
లిక్కర్ ఉత్పత్తికి నీటి కొరత రాదు
ప్రివిలేజ్ ఫీజు వల్ల బార్‌లకు ఎలాంటి నష్టం లేదని.. కానీ తాగేవారిపై కొంత భారం పడుతుందని మంత్రి జూపల్లి అన్నారు. లిక్కర్ ఉత్పత్తికి నీటి కొరత రాదని స్పష్టం చేశారు. కృష్ణా వాటర్, డిండిపై సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం సమీక్ష జరిగిందని గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పెంచుతూ పోయారని.. దానికి తగినట్లుగా వాటర్ సోర్స్ పెంచలేదని అన్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటే తెలంగాణకు ఉపయోగం ఉంటుందని సీఎం రేవంత్‌కు వివరించామని తెలిపారు. ఏదుల నుంచి నీరు తీసుకోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి చెప్పామన్నారు.
అలాగే నల్లగొండకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అచ్చంపేట మీదుగా నీరు ఇవ్వాలని కోరామని చెప్పారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి వాటర్ విషయంలో సమగ్ర విచారణ చేయాలని ఈ సంద్భంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కంటే తక్కువ నీరు ఉంటే.. ఆ జాలాలను ఏపీ తీసుకెళ్లడానికి వీల్లేదని అప్పట్లో తాను స్టే తీసుకొచ్చానని వివరించారు. కర్ణాటక నుంచి వారం రోజులు తెలంగాణకు వాటర్ వచ్చాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్, లండన్‌లో కార్ వాషింగ్ చేయవద్దంటూ రూల్ పెట్టారని గుర్తు చేశారు. శ్రీశైలం నీటిని సాధ్యమైనంత మేరకు వాడుకుంటామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భీమ్‌గల్ పీఎస్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి.. స్పందించిన సీపీ
కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి..