Share News

జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసు.. మరో నలుగురి అరెస్ట్

ABN , Publish Date - May 05 , 2026 | 03:19 PM

జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికలను ట్రాప్ చేయడంలో అర్జున్, ప్రవీణ్ సోదరులకు ఈ నలుగురు నిందితులు సహకరించినట్లు పోలీసులు తెలిపారు.

జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసు.. మరో నలుగురి అరెస్ట్
Jubilee Hills Trap Case

హైదరాబాద్‌, మే 5: జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు అర్జున్ తల్లి, మేనమామ, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. బాలికలను ట్రాప్ చేయడంలో అర్జున్, ప్రవీణ్ సోదరులకు ఈ నలుగురు నిందితులు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నలుగురిని నాంపల్లి కోర్టుకు తరలించారు.


ఈ కేసులో ఇప్పటికే అన్నదమ్ములు అర్జున్, ప్రవీణ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సోదరులు.. అమ్మాయిలను ట్రాప్ చేసి కార్లలో తిప్పుతూ లైంగిక దాడులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను ఉపయోగించి బాధితులను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్‌కు లేదా: బండి సంజయ్

ఒకేరోజు 6 ప్రాంతాల్లో హైడ్రా దాడులు.. అక్రమ యూనిట్లపై ఉక్కుపాదం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 05 , 2026 | 03:22 PM