Share News

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో కేసు

ABN , Publish Date - May 12 , 2026 | 09:33 AM

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో యాక్ట్ నమోదు అయ్యింది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్‌పై పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో కేసు
Jubilee Hills Rich Kids Case

హైదరాబాద్, మే 12: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో యాక్ట్ నమోదు అయ్యింది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్‌పై పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతంలో జతిన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ, కోర్టు రిమాండ్‌ను తిరస్కరించడంతో అతడు బయటకు వచ్చాడు. తాజాగా జతిన్‌పై మరో యువతి తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా వాడుకుని... లక్షల రూపాయలు వసూలు చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు జతిన్‌పై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


రిచ్ కిడ్స్‌ను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసిన కేసులో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు అర్జున్, అతడి సోదరుడు కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాలికలతో పరిచయం పెంచుకునే వారు. వారిని తమ లగ్జరీ కార్లలో షికార్లకు తీసుకెళ్లి వారిపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు తెలీయకుండా వీడియోలు చిత్రీకరించి వాటితో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ వారి నుంచి లక్షలు వసూలు చేసినట్లు బయటపడింది. అర్జున్ సోదరులకు కన్న తల్లి, మేనమామ సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.


ఇవి కూడా చదవండి...

పీఎంజే జ్యువెలరీ చోరీ.. పోలీసుల అదుపులో నిందితులు

చిత్తూరులో గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2026 | 04:31 PM