Share News

వరద రాకుండా నీళ్లు వదిలేస్తే తాగునీటికి ఇబ్బంది రాదా?

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:46 AM

జూరాల ప్రాజెక్టుకు వరద రాకుండా అందులో ఉన్న నీటిని వదిలేస్తే రేపు తాగునీటికి ఇబ్బంది రాదా అని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు.

వరద రాకుండా నీళ్లు వదిలేస్తే తాగునీటికి ఇబ్బంది రాదా?
Joopalli Krishna Rao

  • జూరాల వద్ద అదనపు రిజర్వాయర్‌ ఎందుకు నిర్మించలేదు?

  • బీఆర్‌ఎ్‌సను ప్రశ్నించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టుకు వరద రాకుండా అందులో ఉన్న నీటిని వదిలేస్తే రేపు తాగునీటికి ఇబ్బంది రాదా అని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. ప్రస్తుతం జూరాలలో కేవలం 2 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, వాటిని తాగునీటి అవసరాల కోసం నిల్వ చేశారని చెప్పారు. పాలమూరుపై బీఆర్‌ఎస్‌ నేతలకు అంత ప్రేమ ఉంటే జూరాల వద్ద అదనపు రిజర్వాయర్‌, గట్టు రిజర్వాయర్‌లను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.


సీఎల్పీ మీడియా హాల్‌లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు. తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. ‘‘మాదీ తెలంగాణ రక్తమే! మాకూ బూతులు వస్తాయి. సీఎం రేవంత్‌ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి’’ అని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంబులెన్స్‌ అన్‌ఫిట్‌!
కాంగ్రెస్‌ నేతల ఆస్తుల వద్దకు బీఆర్‌ఎస్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 06:46 AM