Share News

జానీ మాస్టర్‌కి ఫిల్మ్ ఫెడరేషన్ షాక్.. షోకాజ్ నోటీసుల జారీ

ABN , Publish Date - Jul 17 , 2026 | 08:05 PM

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి ఫిల్మ్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

జానీ మాస్టర్‌కి ఫిల్మ్ ఫెడరేషన్ షాక్.. షోకాజ్ నోటీసుల జారీ
Johnny Master

హైదరాబాద్, జులై 17: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అతడికి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జులై 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలను ఫిల్మ్ ఫెడరేషన్‌ సీరియస్‌గా తీసుకుంది. జులై 14న విచారణకు హాజరు కావాలంటూ అతడికి సూచించింది. దీనిపై జానీ మాస్టర్ నుంచి స్పందన లేదు. దీంతో ఫిలిం ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని జానీ మాస్టర్‌ను ఆదేశించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.


అలాగే డ్యాన్సర్ల అసోసియేషన్ తీరుపై ఫిల్మ్ ఫెడరేషన్ మండిపడింది. డ్యాన్సర్ల అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఆమెకు స్పష్టం చేసింది. డ్యాన్సర్ల ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే వివరణ ఇచ్చే వరకు డాన్సర్ అసోషియేషన్‌తోపాటు జానీ మాస్టర్‌కు సహకరించకూడదంటూ అనుబంధ సంఘాలకు ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అంగన్‌వాడీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

ఇతడి టాలెంట్ ముందు కంప్యూటర్ కూడా దిగదుడుపే.. వీడియో వైరల్..

For More TG News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 08:31 PM