విషాదం.. టిప్పర్ లారీ కింద పడి ఐటీఐ విద్యార్థి మృతి
ABN , Publish Date - Feb 17 , 2026 | 02:45 PM
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐటీఐ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..
హైదరాబాద్, ఫిబ్రవరి 17: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీకి బైక్‌పై వెళ్తున్న ఐటీఐ విద్యార్థి.. టిప్పర్ లారీ కింద పడి మృతి చెందాడు. మృతుడిని గొర్రెపోతుల వర్ధన్‌గా గుర్తించారు. నాదర్‌గుల్ నివాసి అయిన ఈ యువకుడు బాలాపూర్ చౌరస్తా సమీపంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బైక్‌పై కాలేజీకి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో టిప్పర్ లారీని దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పక్కన నిలిపిన ఆటో అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో బైక్ అదుపు తప్పింది.
దీంతో బైక్.. టిప్పర్ లారీ ముందు చక్రాల మధ్యలోకి దూసుకెళ్లింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రమాదం తర్వాత లారీ దాదాపు 50 మీటర్ల వరకు బైక్‌ను ఈడ్చుకెళ్లినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
హర్యానా నిట్ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
Read Latest Telangana News And Telugu News