బెంగళూరులో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షో
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:12 AM
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కర్ణాటక పారిశ్రామిక వర్గాలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
కర్ణాటక పరిశ్రమలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కర్ణాటక పారిశ్రామిక వర్గాలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. బెంగళూరులో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026 రోడ్‌షోలో ఆయన పాల్గొని తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను వివరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పరస్పరం పోటీ పడే రాష్ట్రాలు కావని, ఒకే విలువ ఆధారిత సరఫరా గొలుసులో భాగస్వాములని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల పరిశ్రమలు పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. ఏరో స్పేస్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, టెక్స్టైల్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్యాలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026 నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రశాంత్‌భూషణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
రేవంత్‌రెడ్డి ఈఎంఐల ముఖ్యమంత్రి
Read Latest AP News And Telangana News And International