విమానం బాత్‌రూమ్ అద్దంపై బాంబు బెదిరింపు
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:38 AM
కేరళంలోని కన్నూర్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది.
కన్నూర్-శంషాబాద్ ఇండిగో విమానంలో ఘటన
శంషాబాద్ రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కేరళంలోని కన్నూర్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలోని బాత్‌రూమ్ అద్దంపై ‘బాంబు ఉంది’అని రాసి ఉండటాన్ని ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో పైలట్లు శనివారం ఉదయం విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. బాంబు, డాగ్ స్వ్కాడ్లతో తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, శుక్రవారం కూడా శంషాబాద్ నుంచి చెన్నై వెళ్లిన ఇండిగో విమానంలోని బాత్‌రూమ్ అద్దంపై ఇదే తరహాలో బెదిరింపు రాతలు కనిపించాయి. మరో ఘటనలో, మస్కట్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఇండిగో విమానంలో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయగా, ఓ ప్రయాణికుడి బ్యాగులో బుల్లెట్ లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం