ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:39 PM
ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6E352 విమానాన్ని గాలిలో పక్షి ఢీ కొట్టింది.
హైదరాబాద్, అక్టోబర్ 04: ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6E352 విమానాన్ని గాలిలో పక్షి ఢీ కొట్టింది. దీంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి.. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానాన్ని నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానం ముందు భాగంలో సొట్ట ఏర్పడినట్లు గుర్తించారు.
పక్షి ఢీకొనడం వల్లే ఈ నష్టం జరిగినట్లు నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. పైలట్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. మరో వైపు విమానంలో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల చండీగఢ్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయం అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు: మంత్రి లోకేశ్
అలిపిరిలో హైటెక్ వ్యభిచారం.. పలువురి అరెస్ట్