Share News

మొఘలాయి చికెన్‌.. నెల్లూరు చేపల పులుసు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:29 AM

హైటెక్స్‌లో ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ (ఐఆర్సీ) వార్షిక సదస్సులో ప్రతినిధులకు భోజనాల్లో భాగంగా విభిన్న రుచులు కట్టిపడేస్తున్నాయి.

మొఘలాయి చికెన్‌.. నెల్లూరు చేపల పులుసు!

  • ఐఆర్సీ సదస్సులో 90కి పైగా ఘుమఘుమలాడే వంటకాలు

  • మెక్సికన్‌, మంగోలియన్‌ పదార్థాలతో ప్రత్యేక కౌంటర్లు

  • దక్షిణాది, ఉత్తరాది ప్రతినిధుల కోసమూ ప్రత్యేక సెక్షన్లు

  • మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో రుచిచూసిన 5 వేల మంది

హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): హైటెక్స్‌లో ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ (ఐఆర్సీ) వార్షిక సదస్సులో ప్రతినిధులకు భోజనాల్లో భాగంగా విభిన్న రుచులు కట్టిపడేస్తున్నాయి. అతిథిగణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయల్‌ నిజామియా వంటకాలనూ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం, రాత్రి 5వేల మందికిపైగా భోజనాల కోసం 90కిపైగా వంటకాలు వండివార్చారు. వీటిలో తెలంగాణ సంప్రదాయ వంటకాలు, రాయలసీమ రుచులూ ఉన్నాయి. విందులో హైదరాబాద్‌ బిర్యానీకి ప్రత్యేక స్థానం కల్పించారు. మధ్యాహ్న భోజనంలో బిలాల్‌ చికెన్‌ దమ్‌ బిర్యానీ, హైదరాబాదీ మటన్‌ దమ్‌ బిర్యానీ రాత్రి భోజనంలో చికెన్‌ యఖ్నీ పులావ్‌, హైదరాబాద్‌ షాదీ వాలీ మటన్‌ బిర్యానీ ఏర్పాటు చేశారు. శాకాహార ప్రియుల కోసం కడాయి పనీర్‌, ఆలూ క్యాప్సికం కుర్మా, వంకాయ పకోడీ ఫ్రై, క్యాబేజీ-65, కీరా జీడిపప్పు కర్రీ, మెంతి మలై మటర్‌, బేబీ కార్న్‌ కుర్మా, దొండకాయ ఫ్రై, ఆలూ గోబీ అద్రకీ, సొరకాయ మసాలా వంటి వంటకాలు అందించారు.


దక్షిణ భారతీయుల కోసం మామిడి పాలకూర పప్పు, దోసకాయ పప్పు, పెసరపప్పు చారు.. ఉత్తర భారతీయుల కోసం దాల్‌ తడ్కా, దాల్‌ మఖనీ ఏర్పాటు చేశారు. రాయలసీమ రుచుల్లో ఉగ్గాని, మిర్చీ బజ్జీ, రాగిముద్ద, వంకాయ చట్నీ, నాటుకోడి పులుసు, మటన్‌ కర్రీలున్నాయి. విదేశీ వంటకాలకూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మంగోలియన్‌ కౌంటర్‌లో హక్కా నూడుల్స్‌, జాస్మిన్‌ రైస్‌, తెరియాకి సాస్‌, మంగోలియన్‌ బార్బెక్యూ సాస్‌, స్టిర్‌ ఫ్రై వెజిటబుల్స్‌ను అందుబాటులో ఉంచారు. రాత్రి విందులో మెక్సికన్‌ చిల్లీ కౌంటర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాన్‌వెజ్‌ ప్రియుల కోసం ప్రత్యేకంగా విస్తృతమైన మెనూను రూపొందించారు.


మధ్యాహ్నం మొఘలాయి చికెన్‌ కుర్మా, పుంటికూర మటన్‌, నెల్లూరు మామిడి చేపల పులుసు, బోన్‌లెస్‌ ఫిష్‌ ఫ్రై, ప్రాన్స్‌ మసాలా వంటి వంటకాలు ఏర్పాటు చేశారు. రాత్రి విందులో రెడ్‌ చికెన్‌, మటన్‌ రోగన్‌ జోష్‌, తెలంగాణ ఫిష్‌ కర్రీ, గోంగూర ప్రాన్స్‌ ఏర్పాటు చేశారు. వీటికి తోడు పెప్పర్‌ చికెన్‌ ఫ్రై, పెరి పెరి ప్రాన్స్‌, ఫిష్‌ క్రొకెట్స్‌ వంటి స్టార్టర్స్‌ కూడా ఉన్నాయి. విందుకు వచ్చే అతిథులకు స్వాగతం పలికేందుకు పానీయాల ఎంపికలోనూ వైవిధ్యం చూపించారు. మధ్యాహ్న భోజనంలో పైనాపిల్‌ జ్యూస్‌, జల్‌జీరా, స్ర్టాబెర్రీ లెమన్‌ఎడ్‌, లిచీ పంచ్‌లను ఏర్పాటు చేశారు. రాత్రి విందులో మస్క్‌మెలన్‌ జ్యూస్‌, ఆమ్‌ కా పన్నా, క్రాన్‌బెర్రీ సర్‌ప్రైజ్‌, స్ర్టాబెర్రీ పొమోగ్రనేట్‌ షేక్‌లను అందించారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:29 AM