Share News

డేటా సెంటర్లకు కరెంటుతో కటకట!

ABN , Publish Date - Oct 17 , 2026 | 07:09 AM

దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతుండడంతో డేటా సెంటర్ల అవసరం కూడా ఎక్కువవుతోంది. అయితే వాటి ఏర్పాటుకు కావల్సిన స్థలం లభ్యత, విద్యుత్‌, నీటి సదుపాయాలు పొందడం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి.

డేటా సెంటర్లకు కరెంటుతో కటకట!
India Data Centre

  • భూమి, నీటి లభ్యతా కీలకమే..

  • ప్రభుత్వాలు చొరవ చూపాలి: క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతుండడంతో డేటా సెంటర్ల అవసరం కూడా ఎక్కువవుతోంది. అయితే వాటి ఏర్పాటుకు కావల్సిన స్థలం లభ్యత, విద్యుత్‌, నీటి సదుపాయాలు పొందడం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ కోరింది. ప్రభుత్వాలు, విద్యుత్‌ రంగ సంస్థలు కలిసి పనిచేస్తే కొత్త డేటా సెంటర్ల ఏర్పాటులో జాప్యాన్ని తగ్గించవచ్చని ఆ సంస్థ డైరెక్టర్‌ ఆశిష్‌ మిట్టల్‌ అన్నారు.


ఇందుకోసం కొత్త విధానాలు తీసుకురావడం కంటే, ఇప్పటికే ఉన్న వ్యవస్థల ద్వారా అవసరమైన సదుపాయాలను త్వరగా కల్పించడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మరోవైపు డేటా సెంటర్లు పెరిగితే విద్యుత్‌, నీటి వినియోగం కూడా పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అయితే కొత్త టెక్నాలజీల వల్ల ఈ అవసరాలను తగ్గించే అవకాశం ఉందని క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ తెలిపింది.తక్కువ విద్యుత్‌, నీటితో డేటాసెంటర్లను నిర్వహించేందుకు కొత్త పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రశాంత్‌భూషణ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి

పండుగ పూట పల్లెలకు నగరవాసులు

రేవంత్‌రెడ్డి ఈఎంఐల ముఖ్యమంత్రి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 07:09 AM