కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:19 AM
ఓ కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్ అమరలింగంలు సోమవారం హైకోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓ కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్ అమరలింగంలు సోమవారం హైకోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు. వారి రాకను నమోదు చేసుకున్న హైకోర్టు.. వచ్చే వాయిదాకు ప్రత్యక్ష హాజరు నుంచి వారికి మినహాయింపు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నెంబర్ 626/2ఏఏలోని తమ భూమిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ జహానుమా ప్రాంతానికి చెందిన తాజమలుద్దీన్ అలియాస్ మొయినుద్దీన్‌ఖాన్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూమి విషయంలో 2024లో హైకోర్టు జారీచేసిన మధ్యంతర
ఉత్తర్వులను హైడ్రా కమిషనర్, తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. వారు ప్రత్యక్షంగా హాజరయ్యేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ హైకోర్టుకు హాజరయ్యారు. వారిచ్చిన సమాధానంపై కౌంటర్ రిప్లయ్ జారీ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్