న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
ABN , Publish Date - May 27 , 2026 | 07:45 PM
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న హైదరాబాద్‌కు చెందిన రాజకీయ నేతతోపాటు ఆయన కుమారుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, మే 27: న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న హైదరాబాద్‌కు చెందిన రాజకీయ నేతతోపాటు ఆయన కుమారుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు. వక్ఫ్ బోర్డు నుంచి సదరు రాజకీయ నేతను తప్పించాలని న్యాయవాది మొయినుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో రూ.15 లక్షల సుపారీ ఇచ్చి.. న్యాయవాదిని ఈ తండ్రికొడుకులు హత్య చేయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట, లక్డీకాపూల్, మల్లేపల్లి భూముల వివాదంలో ఈ న్యాయవాది హత్య జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడయింది.
వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ పోరాడుతున్నారు. మే 23వ తేదీన మాసబ్ ట్యాంక్ సమీపంలో మొయినుద్దీన్.. తన కారు ఎక్కుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఆయన్ని బలంగా ఢీకొట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన మొయినుద్దీన్ కుటుంబ సభ్యులు.. వెంటనే ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మరణించారు.
ఈ ఘటనపై తొలుత పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేశారు. ఈ ఘటనపై పలు సందేహలు వ్యక్తం కావడంతో.. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు జల్లెడ పట్టారు. న్యాయవాదిని ఢీకొట్టిన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో.. ఈ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వక్ఫ్ భూముల విషయంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటారా? కేటీఆర్‌కు పొంగులేటి సవాల్
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More TG News And Telugu News