Share News

విచారణకు సహకరించని ఉదయ్ కృష్ణారెడ్డి.. మరోసారి కోర్టును ఆశ్రయించిన పోలీసులు..

ABN , Publish Date - Aug 07 , 2026 | 08:09 PM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా కస్టడీలో కృష్ణారెడ్డి నోరు మెదపలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం.

విచారణకు సహకరించని ఉదయ్ కృష్ణారెడ్డి.. మరోసారి కోర్టును ఆశ్రయించిన పోలీసులు..
Uday Krishna Reddy

హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా కస్టడీలో కృష్ణారెడ్డి నోరు మెదపలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో మరోసారి కస్టడీకి కోరుతూ ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు కృష్ణారెడ్డి సహకరించలేదని, మరికొన్ని కీలక విషయాలు తెలుసుకునేందుకు నిందితుడిని కస్టడీకి అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నాడు కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.


కాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కృష్ణారెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. అత్తాపూర్ పోలీసులు ఆయనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా కృష్ణారెడ్డిని తమకు రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత బుధవారం కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు గురు, శుక్రవారాల్లో అత్తాపూర్ పోలీస్ స్టేషన్, ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారుల పర్యవేక్షణలో విచారణ జరిగింది. అయితే, కృష్ణారెడ్డి సహకరించకపోవడంతో పోలీసులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మందు బాబులకు షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్.

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే.. ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు..

Updated Date - Aug 07 , 2026 | 08:15 PM