Share News

మందు బాబులకు షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్..

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:31 PM

మందుబాబులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ షాక్ ఇచ్చారు. బోనాల పండుగ సందర్భంగా ఆగస్టు 9న మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మందు బాబులకు షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్..
Cyberabad Liquor Shops

హైదరాబాద్: మందుబాబులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ షాక్ ఇచ్చారు. బోనాల పండుగ సందర్భంగా ఆగస్టు 9న మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని సీపీ రమేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.


కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని సీపీ రమేశ్ పేర్కొన్నారు. రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ప్రజా శాంతి, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బోనాల వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ రమేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కస్టమర్‌లా వచ్చి బంగారంతో ఉడాయించిన దొంగలు.. వీడియో వైరల్

Updated Date - Aug 07 , 2026 | 04:31 PM