కస్టమర్‌లా వచ్చి బంగారంతో ఉడాయించిన దొంగలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 07 , 2026 | 03:49 PM
వినియోగదారుల ముసుగులో వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా పట్టపగలే బంగారు గొలుసును అపహరించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఓ నగల దుకాణంలో చోటుచేసుకుంది.
వికారాబాద్, ఆగస్టు 07: ఇటీవల కాలంలో బంగారం కొనేవాళ్ల మాదిరిగా షాపుల్లోకి వచ్చి.. చోరీ చేస్తున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పట్టపగాలే నగల దుకాణం వాళ్లను మాటల్లో పెట్టి, మరికొన్ని సందర్భాల్లో బెదిరించి భారీగా బంగారాన్ని దొంగిలిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. ఐదుగురు సభ్యుల ముఠా ఈ ఘటనకు చోరీకి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
తాండురూలోని ఓ గోల్డ్ షాపుకు బురఖా వేసుకుని వచ్చిన ఐదుగురు మహిళలు బంగారం డిజైన్లు చూపించాలని సిబ్బందిని కోరారు. దీంతో షాపు సిబ్బంది వివిధ రకరకాల ఆభరణాలు వారి ముందు ఉంచగా.. వాటిని చూస్తున్నట్లు నటించారు. ఈ క్రమంలోనే పక్కా పథకం ప్రకారం షాప్ సిబ్బంది దృష్టిని మరల్చారు. బురఖాలో ఉన్న ఉన్న ఓ మహిళ గ్లాస్ కౌంటర్ ఎక్కి.. 10 గ్రాముల బంగారు గొలుసును నొక్కేసింది. అనంతరం తన గ్యాంగ్‌ను ‘ఇక వెళ్దాం’ అని సైగ చేసి అక్కడి నుంచి సైలెంట్‌గా జారుకున్నారు.
వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సిబ్బంది స్టాక్ సరిచూసుకున్న సమయంలో ఈ విషయం బయట పడింది. కస్టమర్లకు చూపించిన గొలుసు కనిపించకపోవడంతో షాప్ యజమాని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా వెలుగుచూశాయి. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షాపు యాజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
ప్రొటీన్ లోపం ఉంటే జుట్టు రాలుతుందా?
ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యపై కారు ఎక్కించి హతమార్చిన భర్త!