హైదరాబాద్ టోలీచౌకీలో భవనం పైనుంచి పడి ఇద్దరి మృతి
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:53 PM
హైదరాబాద్‌లోని టోలీచౌకీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కర్రలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్: నగరంలోని టోలీచౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. అల్ హస్నాత్ కాలనీలో భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గోవా కర్రలు కూలిపోవడంతో పైనుంచి కిందపడి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుపతి రావు, అది నారాయణగా గుర్తించారు. గాయపడిన వారు శ్రీకాకుళానికి చెందిన ఆర్.రమేష్, ఒడిశాకు చెందిన ఏం.రమేష్, బండ్లగుడాకు చెందిన లాల్ అహ్మద్‌గా గుర్తించారు. గాయపడ్డ వారిని లంగర్ హౌస్‌లోని ఆలివ్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.
భవనం పక్కనే ఆటోలో ఉన్న వారిపై గొవా కర్రలు పడటంతో అందులో ఉన్నవారు కూడా గాయపడ్డట్లు సమాచారం. భవన నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలపై నిలబడి పనులు చేస్తుండగా ఒక్కసారిగా కర్రలు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు యజమానికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు.