జాడ తెలియని హైదరాబాద్ మహిళ!
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:29 AM
పాల్ ఆకస్మిక వరదల్లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని వాస్తు కాలనీకి చెందిన సుహాసినిరెడ్డి కందిమళ్ల (44) జాడ తెలియకుండా పోయారు. ఆస్ట్రేలియాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె.. మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌కు వచ్చారు.
ఆమె బృందంలోని 29 మంది పరిస్థితీ అదే..
టిబెట్‌లో చిక్కుకున్న మరో 50 మందితో
కూడిన హైదరాబాద్ బృందం
సైదాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): నేపాల్ ఆకస్మిక వరదల్లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని వాస్తు కాలనీకి చెందిన సుహాసినిరెడ్డి కందిమళ్ల (44) జాడ తెలియకుండా పోయారు. ఆస్ట్రేలియాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె.. మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌కు వచ్చారు. కైలాష్ ట్రావెల్స్ ద్వారా 14 రోజుల యాత్ర కోసం నేపాల్‌లోని ఖఠ్మాండూకు చేరుకున్నారు. ఆమె స్నేహితురాలు ఆస్ట్రేలియా నుంచి ఖఠ్మాండూకు చేరుకుని, ఆమెను కలిశారు. టూర్ ఆపరేటర్ ద్వారా 29మంది బృందంగా యాత్రకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం ఇతర యాత్రికులతో కలిసి పూజలు చేసిన వీడియోలను సుహాసిని తన కుటుంబ సభ్యులకు వాట్సా్‌పలో పంపించారు. కానీ తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కైలాష్ ట్రావెల్స్ ద్వారా వెళ్లిన యాత్రికుల్లో ఒక్కరి ఆచూకీ కూడా ఇప్పటివరకు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమ ట్రస్టు తరఫున మానస సరోవర్ యాత్రకు హైదరాబాద్ నుంచి 31 మంది, మిగతా ప్రాంతాల నుంచి ఆరుగురు, 13 మంది సిబ్బందితో బయల్దేరామని ఎంఎస్ రామారావు ట్రస్టు చైర్మన్ పోలప్రగడ శ్రీనివాస్ తెలిపారు. ఆకస్మిక వరదల సమయంలో తాము మానస సరోవర్ దగ్గర కైలాసగిరి నుంచి తిరిగి వస్తుండగా వరదల విషయం తెలిసిందని వెల్లడించారు. తాము తిరిగి రావాల్సిన వంతెన, చైనా ఇమిగ్రేషన్ ఆఫీసు అన్నీ కొట్టుకుపోవడంతో టిబెట్‌లోనే చిక్కుకుపోయామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీ వాసులు ఏడుగురు గల్లంతు
Read Latest AP News And Telangana News And International News And Telugu News