Share News

రేపు అల్పపీడనం.. 3, 4 తేదీల్లో మరొకటి

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:21 AM

ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో..

రేపు అల్పపీడనం.. 3, 4 తేదీల్లో మరొకటి

విశాఖపట్నం, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. మళ్లీ సెప్టెంబరు మూడు లేదా నాలుగో తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. కాగా, గురువారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుపతి, ఒంగోలుల్లో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Aug 28 , 2026 | 06:24 AM