Share News

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

ABN , Publish Date - Mar 24 , 2026 | 07:12 PM

హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. కూకట్‌పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
Hyderabad Rains

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో గట్టిగా వర్షం కురిసింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సూరారం, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. ఎండలతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది.


అయితే, వర్షం కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ముఖ్యంగా ప్రధాన రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల మేరకు రాబోయే గంటల్లో కూడా నగరంలో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.


Also Read:

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు

For More Latest News

Updated Date - Mar 24 , 2026 | 07:36 PM