ఆ ఏరియాల్లో.. మధ్యాహ్నం 3గంటల వరకు కరెంట్ కట్
ABN , Publish Date - Jan 31 , 2026 | 06:52 AM
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఇతర కారణాలతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప(AE Bhimalingappa) ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని కరెంటు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఏఈ అన్నారు. అందులో భాగంగానే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఏడోఫేజ్, హబీబ్‌నగర్, కైతలాపూర్, లోధా సబ్ స్టేషన్లలో కరెంటు సరఫరా ఉండదని ఆయన తెలిపారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. విద్యానగర్, అడిక్‌మెట్ బ్రిడ్జి, డీడీహెచ్, ఎస్‌ఆర్‌డీ క్వార్టర్స్, అంజయ్యభవన్, ఆదర్శ్‌నగర్ 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, ఎల్‌ఎన్‌నగర్, అశోక్‌నగర్ నాలా ప్రాంతం, గాంధీనగర్, ఐఓఈ, ఐసీ క్వార్టర్స్ పరిధిలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదని భవిష్యత్‌లో నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసమే ఈ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయని వినియోగదారులు సహకరించాలని కోరారు.
చంపాపేట: మరమ్మతుల కారణంగా చంపాపేట ఫీడర్ పరిధిలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయిరాంనగర్ కాలనీ, శిఖర ఎన్‌క్లేవ్, నాగార్జున కాలనీ, ఆర్టీసీ కాలనీ, రాఘవేంద్ర కాలనీలో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.
సంతోష్ నగర్: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్రాంతినగర్, నరసింహపురి కాలనీ, పుష్పగార్డెన్, శివం హిల్స్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆలిండియా రేడియో, రాఘవేంద్ర కాలనీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు పెద్దఅంబర్‌పేట ఇండస్ర్టియల్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివపురికాలనీ, ప్యారడైజ్ విల్లాస్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని డీఈ తెలిపారు.

బౌద్ధనగర్: విద్యుత్ కేబుల్స్, తదితర మరమ్మతులు పురస్కరించుకుని శనివారం అజామాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ నాగేశ్వరరావు, ఏఈ రోచితతెలిపారు. విద్యానగర్ ఫీడర్ పరిధిలో విద్యానగర్, వడ్డెరబస్తీ, అడిక్‌మెట్, బ్లడ్ బ్యాంక్‌కాలనీ, అంజయ్యబస్తీ, ఎస్‌ఆర్‌టీ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎల్ ఎన్‌నగర్ ఫీడర్ పరిధిలోని ఎల్‌ఎన్‌నగర్, వారాసిగూడ, అశోక్‌నగర్‌నాలా, అంబర్‌నగర్‌కట్టా, పార్శీగుట్ట, వైఎస్సాఆర్‌పార్క్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.
పేట్‌బషీరాబాద్: కొంపల్లి సబ్ స్టేషన్(Kompally Substation) పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. కేవీఆర్ గార్డెన్ ఫీడర్, జయభేరి ఫీడర్ల పరిధిలో ఉదయం 10 నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. అదే విధంగా వెన్‌సాయి ఫీడర్ పరిధిలోని ఎన్‌సాయి, న్యూమార్క్, శ్వేత శుభం, రాయల్ మిడోస్ అపార్ట్‌మెంట్ల ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ ఉండదన్నారు. కొంపల్లి గ్రామం, వీజీ హోమ్స్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు విద్యుత్ ఉండదని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమ సిబ్బందికి సహకరించాలని ఏఈ శ్రీనివాస్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి రేట్స్ ఇవీ
Read Latest Telangana News and National News