Share News

బట్టల దుకాణాల్లో రహస్య కెమెరాలకు చెక్.. రంగంలోకి షీ నేత్ర టీమ్స్‌..

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:36 PM

పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాల్లో రహస్య కెమెరాలతో మహిళలను చిత్రీకరించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అందుకోసం ఇవాళ (శుక్రవారం) 'షీ నేత్ర టీమ్స్‌'ను రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు.

బట్టల దుకాణాల్లో రహస్య కెమెరాలకు చెక్.. రంగంలోకి షీ నేత్ర టీమ్స్‌..
She Netra Teams

హైదరాబాద్‌: పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాల్లో రహస్య కెమెరాలతో మహిళలను చిత్రీకరించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అందుకోసం ఇవాళ (శుక్రవారం) 'షీ నేత్ర టీమ్స్‌'ను రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో మహిళల భద్రతే లక్ష్యంగా షీ నేత్ర టీమ్స్‌ను ఆయన ప్రారంభించారు.


భాగ్యనగరంలో 7 జోన్లకు 7 ప్రత్యేక షీ నేత్ర టీమ్స్‌ను ఏర్పాటు చేశారు సీపీ సజ్జనార్. ఆయన తన చేతుల మీదుగా ఆయా బృందాలకు కెమెరా డిటెక్టర్ల అందజేశారు. మహిళల ఆత్మగౌరవం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టును ఈ బృందాలు రట్టు చేయనున్నాయి. నగరవ్యాప్తంగా హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు వంటి ప్రదేశాల్లో రహస్య కెమెరాలపై ఉక్కుపాదం మోపనున్నాయి. ముఖ్యంగా బట్టల దుకాణాల్లోని ట్రయల్ రూమ్స్, ప్రైవేట్ ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేయనున్నారు. ఇకపై అత్యాధునిక కెమెరా డిటెక్టర్లతో ఆకస్మిక సోదాలు నిర్వహించనున్నారు.


ఈ బృందాల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీపీ సజ్జనార్.. బట్టల దుకాణాలు, హోటళ్లు, హాస్టళ్లు, మాల్స్ వంటి ప్రాంతాల్లో ఆడవారి భద్రత ఆయా సంస్థల యాజమాన్యాలదే అని తేల్చిచెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే సంస్థలు, సిబ్బందిని బ్లాక్‌లిస్టులో పెట్టే విధంగా చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రతి సంస్థలో కస్టమర్ సేఫ్టీ ఇన్‌ఛార్జ్ నియామకం తప్పనిసరని ఆదేశాలిచ్చారు. షీ టీమ్స్‌తో సమన్వయం కోసం నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య

తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్..

Updated Date - Apr 10 , 2026 | 05:33 PM