Share News

కల్తీ చేస్తే కఠిన చర్యలు.. డీసీపీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరిక

ABN , Publish Date - Mar 20 , 2026 | 03:09 PM

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఆహార కల్తీపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా 'H-FAST' టీమ్‌ను ఏర్పాటు చేశారు.

కల్తీ చేస్తే కఠిన చర్యలు.. డీసీపీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరిక
DCP Vaibhav Gaikwad On Hyderabad Food Adulteration

హైదరాబాద్‌: నగరంలో ఆహార కల్తీపై కట్టుదిట్టమైన చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్.. ABN‌తో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.


ఈ ప్రత్యేక బృందంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కలిసి సుమారు 32 మంది సభ్యులు ఉంటారని గైక్వాడ్ వైభవ్ తెలిపారు. వీరు జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి నగరవ్యాప్తంగా జాయింట్ రైడ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోందని.. ముఖ్యంగా పాలు, నాన్-వెజ్ కల్తీ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ఈ సమస్యను అరికట్టేందుకు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, పదే పదే ఇలాంటి కార్యకలాపాల్లో పట్టుబడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, కల్తీ ఆహారం విక్రయించే దుకాణాలను సీజ్ చేసే చర్యలూ చేపడతామని తెలిపారు. కల్తీ ఆహార పదార్థాల గురించి సమాచారం ఉంటే వెంటనే 8712661212 నంబర్‌కు వివరాలు అందించవచ్చని నగర ప్రజలకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విప్‌ల నియామకం..

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు

Read Latest Telangana News

Updated Date - Mar 20 , 2026 | 03:39 PM