Share News

చెట్టు విరిగిపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:47 AM

ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా విరిగి మీద పడటంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు.

చెట్టు విరిగిపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

  • రోడ్డుపై నడుచుకంటూ వెళ్తుండగా ఘటన

  • నెలరోజుల క్రితమే వివాహం

మన్సూరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా విరిగి మీద పడటంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఏపీలోని కాకినాడకు చెంది న వి.సాయికుమార్‌(29) ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ నాగోల్‌లోని ఇందు అరణ్యలో నివాసముంటున్నాడు.


బుధవా రం సాయంత్రం బాబాయి పి.రాధాకృష్ణ (48), ఆయన కుమారుడు సత్యతో కలిసి గౌరెల్లి వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో కుంట్లూరు రాజీవ్‌గృహకల్ప సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా వారిపై విరిగిపడింది. ఈ ఘటనలో సాయుకుమార్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. రాధాకృష్ణ స్వల్పంగా గాయపడగా, సత్యకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, సాయికుమార్‌కు నెల రోజుల క్రితమే వివాహమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 06:47 AM