హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు రూ.150 కోట్ల నిధుల మంజూరు
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:12 PM
నగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కోసం రూ.150 కోట్ల నిధులు విడుదల చేసింది.
హైదరాబాద్, నవంబర్ 2: నగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కోసం రూ.150 కోట్ల నిధులు విడుదల చేసింది. రుణం రూపంలో నిధుల విడుదలకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2026-27 బడ్జెట్‌లో మెట్రోకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో తొలి విడతగా రూ.125 కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెం.990 జారీ చేసింది. అలాగే ప్రతి నెలా నిధుల వినియోగంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులతో మెట్రో విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు, రాయదుర్గ్-కోకాపేట్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్ - హయత్‌నగర్ కారిడర్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టు-భారత్ ఫ్యూచర్‌సిటీ, జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్ - శామీర్‌పేట్ కారిడర్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించింది.
ఈ వార్తలూ చదవండి
తెలంగాణలో 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న సినీనటి మంచు లక్ష్మి
సైబర్ మోసగాళ్ల వలలో కానిస్టేబుల్.. అధిక లాభాల పేరుతో