బాలుడి హత్య కేసులో మరణశిక్ష విధించిన కోర్టు..
ABN , Publish Date - May 12 , 2026 | 09:10 PM
హైదరాబాద్‌లో ఓ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చిన్నారిని హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించింది.
హైదరాబాద్: ఓ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చిన్నారిని హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో 2023 సంవత్సరంలో జరిగిన మైనర్ హత్యోదంతం సంచలనం సృష్టించింది. ఇమ్రాన్ అలీ ఖాన్ (33) అనే వ్యక్తి చిన్నారిని హత్య చేయగా.. అతనికి మహమ్మద్ రఫీక్ (32) సహకరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సనత్‌నగర్ పోలీసులు అప్పుడే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితులు ఇమ్రాన్ అలీ ఖాన్, మహమ్మద్ రఫీక్‌ను గుర్తించి అరెస్టు చేశారు. కేవలం సాంకేతిక సాక్ష్యాలతో కేసును ఛేదించి.. వివరాలను కోర్టుకు సమర్పించారు. పకడ్బందీగా సాక్ష్యాలు ఉండటంతో సంతృప్తి చెందిన కూకట్‌పల్లి కోర్టు.. చిన్నారిని వారే హత్య చేసినట్లు నిర్ధారిస్తూ దోషులుగా తేల్చింది. ఇమ్రాన్ అలీ ఖాన్‌కు మరణశిక్ష, అతనికి సహకరించిన మహమ్మద్ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.వెంకటేశ్వర రావు తీర్పు వెలువరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బండి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం
ఢిల్లీ హైకోర్టుకు అక్కినేని నాగార్జున..