మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో నిందితులు
ABN , Publish Date - May 11 , 2026 | 11:00 AM
విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య, వారి నివాసంలో నగదు దోపిడీ కేసులో నగర పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, మే11: విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య, వారి నివాసంలో నగదు దోపిడీ కేసులో నగర పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పుణేలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి.. హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. కల్పన మహారాష్ట్రలోని పుణేలో ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. దాంతో పలు పోలీస్ బృందాలు పుణేకు బయలుదేరి వెళ్లాయి. కల్పన ఆచూకీ గుర్తించి.. అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
నేపాల్‌కు చెందిన సాహు గ్యాంగ్.. ఈ దోపిడీకి స్కెచ్ చేసి అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని జైలు నుంచి ఈ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్, ముంబై, పాట్నా నుంచి వచ్చిన పలువురు వ్యక్తులను కల్పనకు సాహు గ్యాంగ్ అటాచ్ చేశారని పోలీసులు విచారణలో కనుగొన్నారు. వీరి ద్వారా దోపిడి చేసిన బంగారాన్ని ముంబైలో దాచిపెట్టారని పోలీసులకు నిందితులు తెలిపినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్ల ఆందోళన.. డిపోలో నిలిచిపోయిన బస్సులు
కడప అల్మాస్‌పేట సర్కిల్ ఘటనపై అధికారులు సీరియస్..
For More TG News And Telugu News