Share News

అండాల సేకరణకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం దోపిడీ కాదా?: హైకోర్టు

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:54 AM

అండాల సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళలకు హార్మోన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడం దోపిడీ కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది.

అండాల సేకరణకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం దోపిడీ కాదా?: హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అండాల సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళలకు హార్మోన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడం దోపిడీ కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఎలాంటి పోలిక లేకపోయినా.... బర్రెలు ఎక్కువ పాలు ఇవ్వడం కోసం హార్మోన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే దాని ఆరోగ్యం పాడవుతుంది కదా? అని వ్యాఖ్యానించింది.


అక్రమ అండాల సేకరణ రాకెట్‌లో నిందితురాలిగా ఉన్న పద్మజ ఫర్టిలిటీ సెంటర్‌ యజమాని డాక్టర్‌ పద్మజ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఏజెంట్లు చేసిన పొరపాట్లకు డాక్టర్లకు సంబంధం లేదని, ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ముందస్తు బెయిల్‌పై 23న తీర్పు ఇస్తామని తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 05:54 AM